దిశ ఎఫెక్ట్ : స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు

by Taduka Kalyani |   (  Updated:2026-07-04 14:41:20  IST  )

అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీవో లాలయ్య హెచ్చరించారు.

దిశ ఎఫెక్ట్ : స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు
X

దిశ, కడ్తాల్‌ : అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీవో లాలయ్య హెచ్చరించారు. శనివారం దిశ పత్రికలో ప్రచురితమైన "ఫ్యూచర్ మాటున నయా మోసం" కథనానికి స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు ముద్విన్ రెవెన్యూ పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ల వద్ద ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను గ్రామ పంచాయతీ సిబ్బందితో తొలగించారు.ఈ సందర్భంగా ఎంపీవో లాలయ్య మాట్లాడుతూ...సంబంధిత శాఖల అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని నిబంధనలు ఉల్లంఘిస్తూ లేఅవుట్లు అభివృద్ధి చేసే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసినా, ప్రచారం కోసం ఫ్లెక్సీలు,జెండాలు ఏర్పాటు చేసినా వాటిని వెంటనే తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story