- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోధుమ కుంటలో పడి వృద్ధుడి మృతి..
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.

దిశ, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బీడీ కాలనీ శివారులో ఉన్న గోధుమ కుంటలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బచ్చన్నపేటకు చెందిన చేనేత కార్మికుడు ఏలూరి బాలరాం (60) ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గోధుమ కుంట వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుడికి గతంలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ శోభన్ తెలిపారు.
పోలీసుల హెచ్చరిక..
ఈ ప్రమాద సంఘటన నేపథ్యంలో బచ్చన్నపేట పోలీసులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు నీటి కుంటలు, వాగులు, చెరువులు, ఇతర నీటి వనరుల సమీపంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ కూడా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.






