- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్బన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలో అర్బన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో అఫర్డేబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు....

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలో అర్బన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో అఫర్డేబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
క్యూర్ పరిధిలో...
ఇదే స్ఫూర్తిని క్యూర్ పరిధిలో చేపట్టబోయే అఫర్డేబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్‌పైనా చూపించాలన్నారు. క్యూర్ పరిధిలో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు రెవెన్యూ, హౌసింగ్ విభాగాల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పేదలకు ఇళ్లు అందించే విధంగా అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. స్థలాలను గుర్తించి తక్షణమే ఖరారు చేయాలనని పేర్కొన్నారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో 500 ఇళ్లు నిర్మిస్తున్నామని.. ఈ ఇళ్లకు సంబంధించి టెండర్లను వీలైనంత ఖరారు చేస్తామని తెలిపారు.
శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా పది ఆర్డీవో, 107 తహశీల్దార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రెండు డీఐజీ, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సదుపాయాలతో, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఉంటాయని చెప్పారు. విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సోలార్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి వీపీ గౌతమ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.






