- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు
ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల: ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. గడువులోగా ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. రూ.129.25 కోట్ల తో ఆస్పత్రి నిర్మాణం, రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింతగా చేరువ కానున్నాయన్నారు. అనంతరం నస్పూర్ మండలంలోని ఈ.వి. ఎం గోదాం వద్ద భద్రత చర్యలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వివి ప్లాంట్ల భద్రత ఏర్పాట్లపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిగ ఏర్పాటను పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.






