మా విధానం అదే.. వెనక్కి తగ్గం: బొత్స

by Vemula.Srinu Prasad |

తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని విషయంలో ఆయన మనుపటి నిర్ణయానికే మద్దతు పలికారు. ..

మా విధానం అదే.. వెనక్కి తగ్గం: బొత్స
X

దిశ, వెబ్ డెస్క్: తాము మావిగన్(Mavigan)కే కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Bosta Satyanarayana) స్పష్టం చేశారు. అమరావతి(Amaravati) రాజధాని విషయంలో ఆయన మనుపటి నిర్ణయానికే మద్దతు పలికారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిందని, ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని ఆరోపించారు. లక్షల కోట్లు అప్పు తెచ్చుస్తున్నారని, ఏ పథకానికి ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తే చెప్పడంలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపలనే మళ్లీ చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అవన్నీ సీఎం చంద్రబాబునాయుడికి పట్టడం లేదని బొత్స విమర్శించారు.

Next Story