ఆలోచనను ఉపసంహరించుకోండి: మాజీ సీఎం జగన్‌కు CPI హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనను రాష్ట్ర సీపీఐ వ్యతిరేకించింది. అంతేకాదు గతంలో ఆయన మాట మార్చిన విధానంపైనా విమర్శలు చేసింది...

ఆలోచనను ఉపసంహరించుకోండి: మాజీ సీఎం జగన్‌కు CPI హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) మావిగన్(Mavigan) ప్రతిపాదనను రాష్ట్ర సీపీఐ(Cpi) వ్యతిరేకించింది. అంతేకాదు గతంలో ఆయన మాట మార్చిన విధానంపైనా విమర్శలు చేసింది. రాష్ట్ర రాజధానిపై రోజుకో మాట.. పూటకో పేరు చెప్పడాన్ని తప్పుబట్టింది. అసెంబ్లీ సాక్షిగా అమరావతి(Amaravati)ని ఒప్పుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ రైతుల్ని ప్రజలను మోసం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు(CPI National Executive Member Muppalla Nageswara Rao) మండిపడ్డారు. ఇప్పటికే అమరావతిని కేంద్రం చట్టబద్ధత చేసిన తర్వాత కూడా మావిగన్ అని చెప్పడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం కాబోతోందన్నారు. ఇప్పటికైనా జగన్ మావిగన్ ఆలోచనను ఉపసంహకరించుకోవాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు.

Next Story