- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులు, వరద కాలువల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చెరువులు, వరద కాలువల పరిరక్షణకు హైడ్రా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

దిశ, రామచంద్రాపురం : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చెరువులు, వరద కాలువల పరిరక్షణకు హైడ్రా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం పటాన్‌చెరు సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. తెల్లాపూర్‌లోని చెలికుంట, మేళ్లచెరువు తూములు, వరద కాలువలు ,వాటి బఫర్ జోన్లను నిశితంగా పరిశీలించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, కాలువలను ఆక్రమించినా లేదా అక్రమ నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా వరద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, చెత్త, ఇతర అడ్డంకులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వరదలు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టి, చెరువులు, కాలువల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.






