ఆగ్రో సేవా కేంద్రంపై సస్పెన్షన్ వేటు

by Kodari Anjali |

రైతులు ఏవోకి ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు స్పందించి ఏడిఏ పూర్ణచందర్ రెడ్డి ఆగ్రో రైతు కేంద్రంపై 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ఆగ్రో సేవా కేంద్రంపై సస్పెన్షన్ వేటు
X

దిశ, తిమ్మాజిపేట: మండల కేంద్రంలో ఒక ఆగ్రో సేవా కేంద్రంలో రైతుల నుండి నిలుపు దోపిడీ చేస్తున్నారని శుక్రవారం రోజు రైతులు ఏవో కి ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు స్పందించి ఏడిఏ పూర్ణచందర్ రెడ్డి ఆగ్రో రైతు కేంద్రంపై 15 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్భంగా శనివారం రోజు మండల కేంద్రంలో ఏవో కమల్ కుమార్ చేతుల మీదుగా సస్పెన్షన్ ఆర్డర్ ఆగ్రో రైతు యజమానికు అందజేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా యూరియాపై అధికంగా వసూలు చేస్తున్నారనీ రైతులు ఆందోళన చెందుతూ.. తన దృష్టికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.. తుమ్మలకుంట తండాకు చెందిన మహిళ రైతు నీలిమ యూరియా యాప్ నుంచి ఆరు బస్తాల యూరియా బుక్ చేశారు. ఆమెకి యూరియా అలర్ట్ కావడంతో శుక్రవారం మండల కేంద్రంలో ఒక ఆగ్రో సేవా కేంద్రం నుంచి ఆరు బస్తాల యూరియా తీసుకున్నారు.

రైతులు ఆగ్రో సేవ కేంద్రాలలో...

అయితే నిబంధనల ప్రకారం.. రూపాయలు 300 తీసుకోవాల్సి ఉండగా.. అదనంగా పది రూపాయలు వసూలు చేసి మొత్తం 310 చొప్పున ఆరు బస్తాలకు 1860 రూపాయలు తీసుకున్నారు. దీనిపై సదర్ రైతు అభ్యంతరం వ్యక్తం చేస్తే సేవా కేంద్రం యజమాని దురుసుగా మాట్లాడారని, అంతే తీసుకుంటామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారనీ, దీంతో ఆగ్రహించిన రైతు సంబంధించిన వివరాలుతో కూడిన మొత్తాన్ని వ్యవసాయ అధికారికి అందజేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారి స్పందించి యూరియా రూ. 266కు వస్తుందని రవాణా హమాలి ఖర్చులు కలుపుకొని కొద్దిగా ఎక్కువ అమ్ముకోవచ్చని 300 లకు మాత్రం మించకూడదని ఏవో కమల్ కుమార్ తెలిపారు. అధికంగా వసూలు చేసిన విషయం నిర్ధారణ అయితే దీనిపై చర్యలు తీసుకుంటామని దుకాణాన్ని సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు ఆగ్రో సేవ కేంద్రాలలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకొరావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Next Story