- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మమ్మల్ని చంపాలని చూస్తున్నారు.. సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
తన కుమారుడిపై మేకులు కొట్టి దారుణంగా చంపారని, తమను కూడా హత్య చేసేందుకు చూస్తున్నారని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: తన కుమారుడిపై మేకులు కొట్టి దారుణంగా చంపారని, తమను కూడా హత్య చేసేందుకు చూస్తున్నారని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కనీసం తన కుమారుడు సాయికృష్ణ బూడిదైనా ఇవ్వాని కోరారు. లేకపోతే తాను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని హెచ్చరించారు. సాయి కృష్ణ కేసులో నలుగురు, ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, తన కుమారుడిని హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని ఆరోపించారు. లాక్ అప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సిట్ విచారణ తీరుపై చేసిన సాయికృష్ణ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు.
జరిగిందిదీ..
కాగా విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ జరిగింది. ఈ విషయం చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు.. సీఐ నాగరాజును నిందితుడిగా గుర్తించింది. మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే సాయికృష్ణ మృతదేహం ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటికీ తన కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూనే ఉన్నారు. తాజాగా కూడా మరోసారి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిట్ విచారణలో సాయికృష్ణ మృతదేహం ఏమైందనే విషయాలు బయటకు వస్తాయేమో చూడాలి.
నా కొడుకు నీ అభిమాని.. బాగా బుద్ధి చెప్పావ్: సాయికృష్ణ తల్లి






