- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్ లీక్.. నెట్టింట రాముడి గెటప్ వైరల్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ హల్ చల్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి మహేశ్ బాబుకు సంబంధించిన ఒక లుక్ లీక్ అయిందంటూ ఒక ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ లీకైన ఫోటోలో మహేశ్ బాబు 'శ్రీరాముడి' గెటప్ లో కనిపిస్తుండటం విశేషం. దైవికమైన లుక్‌లో మహేశ్ బాబు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారంటూ అభిమానులు ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటో నిజంగానే షూటింగ్ స్పాట్ నుండి లీకైన ఒరిజినల్ ఫొటోనా? లేక టెక్నాలజీని ఉపయోగించి అభిమానులు ఎవరైనా క్రియేట్ చేసిన ఏఐ (Al Generation) చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.






