చోరీకి పాల్పడింది బంధువులే.. ఉమ్రాకు వెళ్ళిన ఇంట్లో చోరీ కేసులో బిగ్ ట్విస్ట్

by Prasad Jukanti |

నాంపల్లి హబీబ్ నగర్‌లో ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో భారీ చోరీ కేసులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.

చోరీకి పాల్పడింది బంధువులే.. ఉమ్రాకు వెళ్ళిన ఇంట్లో చోరీ కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మక్కాలోని కాబా భవనాన్ని దర్శించేందుకు ప్రత్యేకంగా చేసే 'ఉమ్రా' యాత్రకు వెళ్లిన ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ఘటనలో బంధువులే దొంగలుగా పోలీసులు గుర్తించారు. నాంపల్లి హబీబ్ నగర్‍లో షేక్ అక్బర్ మొహియూద్ధీన్ గత వారం తన కుటుంబంతో కలిసి ఉమ్రాకు వెళ్లారు. దైవ దర్శనానికి వెళ్లి సంతోషంగా తిరిగి వచ్చిన ఆ కుటుంబం తమ కోసం ఇంటి వద్ద ఊహించని షాక్ ఎదురు చూస్తోందని గ్రహించలేకపోయారు. ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరగడం ఆకుటుంబాన్ని షాక్‍కు గురి చేసింది. తాము యాత్రకు వెళ్లిన సమయంలో ఇంట్లో దొంగలు పడి రూ. 21 లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంలో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇది బంధువుల పనే అని తేల్చారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన బంధువుల ఇల్లే లక్ష్యంగా ముగ్గురు నిందితులు ఇంటి తాళాలు పగలగొట్టి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన బంగారం, నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Next Story