త్వరలో కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

త్వరలో కుప్పంలోనూ బంగారాన్ని ఉత్పత్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు..

త్వరలో కుప్పంలోనూ బంగారం ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో కుప్పం(Kuppam)లోనూ బంగారాన్ని(Gold) ఉత్పత్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. శనివారం కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వర్ణకుప్పానికి నాంది పలుకుతామని చెప్పారు. స్వర్ణ కుప్పం కావాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. స్వర్ణయుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కొనియాడారు. కుప్పం నియోజకవర్గంలో రూ. 9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేశామని ఆయన స్పష్టం చేశారు.

యువతకు సీఎం పిలుపు

అలాగే కుప్పం నియోజకవర్గం నుంచి పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు నాంది పలుకుదామని స్థానిక యువతకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అడిడాస్ కంపెనీ ద్వారా 20 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. డెయిరీ,ఫుడ్ ప్రాసెసింగ్, ఫౌల్ట్రీ పరిశ్రమలు కుప్పానికి వచ్చాయని, తద్వారా 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం కుప్పం నియోజకవర్గానికి వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తన నియోజకవకర్గంలో పూర్తిగా వాణిజ్య పంటలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం విషయంలో సెరీ కల్చర్ దిశగా అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story