రోడ్డు నిర్మాణ పనులకు రూ. 7 కోట్ల నిధుల మంజూరు

by Kodari Anjali |

వెదురుగట్ట గ్రామం నుండి చాకుంట మీదుగా కరీంనగర్ రూరల్ గ్రామం ఫకీర్ పేట వరకు రూ.7 కోట్ల 13 లక్షల నిధులతో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

రోడ్డు నిర్మాణ పనులకు రూ. 7 కోట్ల నిధుల మంజూరు
X

దిశ, చొప్పదండి: మండలంలోని వెదురుగట్ట గ్రామం నుండి చాకుంట మీదుగా కరీంనగర్ రూరల్ గ్రామం ఫకీర్ పేట వరకు రూ.7 కోట్ల 13 లక్షల నిధులతో చేపట్టనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుమతులు మంజూరు చేయించినట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ కలిగిందని నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల కరీంనగర్ జిల్లా కేంద్రానికి దూర భారం తగ్గడమే కాకుండా రైతులకు, విద్యార్థులకు, దినసరి కూలీలకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

Next Story