ఆరు దశాబ్దాల కల.. సాకారం చేసిన సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ఆరు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. కుప్పం నియోజకవర్గం కంగుంది రైతులకు డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 322 మంది అన్నదాతలకు 460.19 ఎకరాల భూములపై గ్రామ సభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు....

ఆరు దశాబ్దాల కల.. సాకారం చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆరు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సాకారం చేశారు. కుప్పం నియోజకవర్గం(Kuppam constituency) కంగుంది రైతుల(Farmers)కు డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 322 మంది అన్నదాతలకు 460.19 ఎకరాల భూములపై గ్రామ సభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఈ భూమిపై చట్టబద్ధ హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంగుంది గ్రామ రైతులకు సీఎం చంద్రబాబు చేతులు మీదుగా పట్టాలు పంపిణీ చేశారు.

ఆరు దశాబ్ధాల వివాదానికి పరిష్కారం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆరు దశాబ్ధాల భూముల వివాదానికి తెరదించామని చెప్పారు. వివాదస్పద భూములని తెలిసి పకడ్బందీగా సర్వే చేశామని తెలిపారు. ఇంకా కొన్ని ఉన్నాయని అవి కూడా పరిశీలనలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా తీసుకుందని, సర్వే రాళ్లపైనా సొంతబొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. అలాంటి దుర్మార్గమైన పనులను తాము చేయడం లేదని, సరి చేయడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. భూ పట్టాలపై క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా అంశాలను కూడా పొందుపర్చుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story