మేకతో మాట్లాడించిన హీరోయిన్.. క్యూట్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

సౌత్ బ్యూటీ రుక్మిణి వసంత్ చేసిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ ఈ వీడియాలో ఎవరికీ తెలియని తన టాలెంట్ ను బయటపెట్టారు. సాధారణంగా రుక్మిణి అంటే గుర్తుకు వచ్చేది అందచందాలు చూపించడం.. యాక్టింగ్ తో ఆకట్టుకోవడమే. కానీ ఈ వీడియో చూస్తే రుక్మిణికి మిమిక్రీ కూడా వచ్చా అని ఆశ్చర్యపోతారు.

మేకతో మాట్లాడించిన హీరోయిన్.. క్యూట్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ బ్యూటీ రుక్మిణి వసంత్ చేసిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ ఈ వీడియాలో ఎవరికీ తెలియని తన టాలెంట్ ను బయటపెట్టారు. సాధారణంగా రుక్మిణి అంటే గుర్తుకు వచ్చేది అందచందాలు చూపించడం.. యాక్టింగ్ తో ఆకట్టుకోవడమే. కానీ ఈ వీడియో చూస్తే రుక్మిణికి మిమిక్రీ కూడా వచ్చా అని ఆశ్చర్యపోతారు. ఇక వీడియోలో రుక్మిణి పక్కన కొన్ని మేకలు కనిపించగా వాటిని ఇమిటేట్ చేశారు. వెంటనే మేకలు కూడా ఆమెకు రిప్లై ఇచ్చాయి. అచ్చం మేక మాదిరిగానే రుక్మిణి వసంత్ అరవడంతోనే అక్కడ ఉన్న మేకలు సైతం అనుసరించాయి.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో రుక్మిణి వసంత్ అసలైన గోట్'(G.O.A.T) అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ సినిమా చందనవనం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లును అందుకుంటోంది. ఇప్పటికే రవితేజ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అదే విధంగా నితిన్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలోనూ హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

Next Story