- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను బావిలోకి తోసిన నిందితుని పట్టివేత..
ఇటీవల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ ఆభరణాలు దోచుకొని బావిలో నూకేసిన దుండగుడిని పట్టుకున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు.

దిశ, తిమ్మాపూర్: ఇటీవల జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళ ఆభరణాలు దోచుకొని బావిలో నూకేసిన దుండగుడిని పట్టుకున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. శనివారం మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో మహిళను దుండగుడు తోసేసిన బావి వద్దకు వచ్చిన సీపీ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 1 న గంగాధర లక్ష్మి అనే మహిళను దుండగుడు పని ఇప్పిస్తానని చెప్పి కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి తీసుకువచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు అభరణాలను లాక్కొని ఆమెను వ్యవసాయ బావిలోకి తోసేసి పారిపోగా 24 గంటల పాటు బావిలో నరకం అనుభవించిన లక్ష్మిని మరుసటి రోజు పోలీసులు బయటకు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన నిందితున్ని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే సంవత్సర కాలంలో ఇలాంటి తరహా ఘటన ఇది రెండోదని అన్నారు. కార్యక్రమం. కార్మికుల రక్షణ కోసం కలెక్టర్, కార్మిక శాఖ అధికారులతో చర్చించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.






