- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి..
by Kodari Anjali |
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్ - శిరీష దంపతుల కుమార్తె విశ్వైక (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుంచి తిరిగి వచ్చాక, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైన సమయంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిపోయింది. గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని బయటకు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్ల ముందే రెండేళ్ల కూతురు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంతో పాటు సమీప గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story






