- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండాపూర్‌లో వావ్ మండి రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
కొండాపూర్‌లోని వావ్ మండి రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని వావ్ మండి రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్‌ను పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ నిల్వ చేసినట్లు వెల్లడైంది. పాత్రలు శుభ్రం చేసేందుకు తగిన సదుపాయాలు లేకపోవడంతో పాటు, వాటిని వేడి నీటితో శుభ్రపరచడం లేదని గుర్తించారు. హోటల్ సిబ్బందికి అవసరమైన వైద్య ధృవీకరణ పత్రాలు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. అలాగే పచ్చి, వండిన మాంసాన్ని కలిపి నిల్వ చేయడం, శాఖాహార మరియు మాంసాహార పదార్థాలను వేర్వేరుగా భద్రపరచకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. కూరగాయలు కోసే విభాగంలో గోడలు, పైకప్పు పెచ్చులూడి ఉండటం, పాడైపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారబోస్తుండటం వంటి పరిశుభ్రత లోపాలను అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలపై సంబంధిత యాజమాన్యానికి తగిన సూచనలు జారీ చేసి, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.






