కొత్త ఆరంభాలకు స్వాగతం.. డెలివరీకి ముందే మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత

by Chukka Sudharani |

ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల పలకరించిన టాలీవుడ్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తన లైఫ్‌లో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తుంది.

కొత్త ఆరంభాలకు స్వాగతం.. డెలివరీకి ముందే మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత
X

దిశ, సినిమా: ఈ ఏడాది ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల పలకరించిన టాలీవుడ్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం తన లైఫ్‌లో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తుంది. గతేడాది దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత.. తాజాగా తాను గర్భవతి అనే శుభవార్తను అభిమానులతో పంచుకుంది. అలాగే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో అందరూ సామ్ ఇక రెస్ట్ తీసుకుంటుందేమో అని భావించారు. కానీ తాజాగా అతి పెద్ద ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన సోనీ లివ్ తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా సామ్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా.. ‘మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై వ‌ర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపింది. కాగా.. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉండగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story