- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహదారి పక్కన అక్రమ నిర్మాణాలు తొలగింపు
అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ లోని బీరంగూడ ప్రధాన రహదారిపై ఇరువైపులా అక్రమంగా వేసిన షెడ్లను శనివారం సీవీఏంసీ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు.

దిశ, అమీన్ పూర్ : అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ లోని బీరంగూడ ప్రధాన రహదారిపై ఇరువైపులా అక్రమంగా వేసిన షెడ్లను శనివారం సీవీఏంసీ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. బీరంగూడ శ్యామ్ రాక్ అపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. కాగా కొందరు వ్యక్తులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అందుకు ఎన్నో ఏండ్లుగా వేసుకున్నటువంటి చిన్న చిన్న షెడ్లను తొలగించి అన్యాయం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏసీబీ ప్రసాద్ మాట్లాడుతూ బీరంగూడ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. అందుకు ఈ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్యల ఉత్పన్నమవుతున్నాయని దీంతో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అక్రమ నిర్మాణాలపై కూల్చివేతల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.






