- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్తా: యూట్యూబర్ రావణ్ హెచ్చరిక
ఏలూర దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ పాలైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు అయింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఏలూర దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ(Eluru Dalit Christian Rally for Rights )లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ పాలైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్(YouTuber Bachalakuri Joseph, alias Prashna Ravana) అలియాస్ ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు అయింది. దీంతో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి కోర్టు ఎదుట ఆయనన్ను జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ కేసు, బెయిల్‌పై తమరు స్పందిస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం ఏమీ మాట్లాడనని చెప్పారు. అయితే త్వరలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్తానని రావణ్ హెచ్చరించారు.
పలు కేసుల్లోనూ బెయిల్
కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అసభ్య వ్యాఖ్యలు జనసేనికుల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. దెబ్బతో పలు పోలీస్ స్టేషన్లలో రావణ్ పై ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసుతో పాటు మరోచోట నమోదైనా కేసులోనూ ఆయన బెయిల్ మంజూరు అయింది. అయితే అనకాపల్లి జిల్లాలోనూ రావణ్‌పై కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు ఎలమంచిలికోర్టులో తాజాగా ప్రవేశ పెట్టారు. ఈ కేసులోనూ ఆయనకు ఊరట లభించింది. బెయిల్ మంజూరుకావడంతో రావణ్ విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే అన్ని చెప్తానని, తనకు మద్దతిచ్చిన వాళ్లందరికి ధన్యవాదాలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.






