- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే
గత ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు మానుకోవాలనీ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.

దిశ, మల్లాపూర్: గత ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు మానుకోవాలనీ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, ఒబులాపూర్ తండా, మొగిలిపేట, కొత్త ధాం రాజ్ పల్లి, వాల్గొండ, మల్లాపూర్, గొర్రెపల్లి, రేగుంట, సాతారం, చిట్టాపూర్, కుస్తాపూర్ గ్రామాల్లో సీఎంఆర్ఎప్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 36 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, అరకోరగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, రాఘవ పేట్ సర్పంచ్ తోట శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ హరీష్ రెడ్డి, నాయకులు ఏలేటి మహేష్ రెడ్డి, ఏనుగు రాం రెడ్డి, డీలర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






