- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ దర్శనాలు రద్దు !
by Naga Rani Yarlagadda |
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు ఆ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ఒక అలర్ట్ జారీ చేసింది. జులై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జులై 13, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని, ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది. జులై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది.
Next Story






