- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి అదృశ్యం.. కేసు నమోదు
by Kodari Anjali |
స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, కాప్రా: స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శేఖర్ కథనం ప్రకారం... అశోక్ నగర్‌లో నివసించే బండాలు రత్నాలు కూతురు బండాలు అంజలి (20) ఈనెల 2వ తేదీన తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు కుషాయిగూడకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అంజలి రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో.. ఆమె ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధుమిత్రుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






