- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డిలో రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ పోస్టు... నెలకు 30 వేల పారితోషికం
హైదరాబాద్‌లోని డా. ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ.టి - MCRHRDIT, తెలంగాణ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా శిక్షణ కేంద్రంలో రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ పోస్టును కన్సల్టెన్సీ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి పాండు శనివారం తెలిపారు.

దిశ,సంగారెడ్డి అర్బన్: హైదరాబాద్‌లోని డా. ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ.టి - MCRHRDIT, తెలంగాణ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా శిక్షణ కేంద్రంలో రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ పోస్టును కన్సల్టెన్సీ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి పాండు శనివారం తెలిపారు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి నెలకు 30 వేల రూపాయల పారితోషికం చెల్లించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇటీవల ఆర్‌డీవో, పీడీ-డీఆర్‌డీఓ లేదా డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో పదవీ విరమణ పొంది ఉండాలని స్పష్టం చేశారు. అలాగే దరఖాస్తుదారులు సంగారెడ్డి జిల్లాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఉండాల్సి ఉంటుంది. బోధన, శిక్షణ కార్యక్రమాల పట్ల ఆసక్తి, నిబద్ధత కలిగి ఉండటంతో పాటు మచ్చలేని సర్వీస్ రికార్డు ఉండాలని, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని డీఆర్వో పాండు తెలిపారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ లోపు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టరేట్, సంగారెడ్డి కార్యాలయానికి సమర్పించాలని ఆయన సూచించారు. ఈ పోస్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టరేట్, సంగారెడ్డిని 9849904284 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.రిటైర్మెంట్ అనంతరం అనుభవజ్ఞులైన అధికారుల సేవలను శిక్షణ రంగంలో వినియోగించుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.






