ధన్వాడలో గ్యాస్ సిలిండర్ల కోసం లొల్లి లొల్లి..

by Kodari Anjali |

మండల కేంద్రమైన ధన్వాడ ఇండియన్ గ్యాస్ వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు లొల్లి లొల్లి చేశారు.

ధన్వాడలో గ్యాస్ సిలిండర్ల కోసం లొల్లి లొల్లి..
X

దిశ, ధన్వాడ: మండల కేంద్రమైన ధన్వాడ ఇండియన్ గ్యాస్ వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు లొల్లి లొల్లి చేశారు. గంటల తరబడిగా సిలిండర్ కోసం క్యూ కట్టారు. తిండి తిప్పలు వదిలేసి సిలిండర్ల కోసం వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి అయ్యా మాకు సిలిండర్ ఇవ్వండి అంటూ వేడుకున్నారు. ఇదే సందర్భంలో వినియోగదారుల మధ్య గొడవకు దారి తీసింది. సిలిండర్ కోసం నేను ముందు అంటే.. నేను ముందు అంటూ వినియోగదారులు లొల్లి చేసుకున్నారు. సిలిండర్ల బుక్కులను లైన్‌లో పెట్టడానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు సిలిండర్ల కొరత సమస్యను తీర్చాలని వినియోగదారులు కోరారు. మండలంలోని చర్లపల్లి కొండాపూర్ కిష్టాపూర్ ధన్వాడ పలు తాండల నుంచి వచ్చి వినియోగదారులు సిలిండర్ల కోసం పడగాపులు కాశారు. గ్యాస్ కేంద్రం నిర్వాహకులు సైతం పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడంతో ఇబ్బంది సైతం ఎదుర్కొన్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నాం, మాకు సిలిండర్ రాలేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story