చిక్కుల్లో బొజ్జ ఐశ్వర్య.. కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇటీవల కాలంలో ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే రావణ్ అరెస్ట్‌‌ను నిరసిస్తూ పిఠాపురం వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బొజ్జ ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేశారు..

చిక్కుల్లో బొజ్జ ఐశ్వర్య.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇటీవల కాలంలో ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే రావణ్ అరెస్ట్‌‌ను నిరసిస్తూ పిఠాపురం వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బొజ్జ ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చేతగాని దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓడించపోతే తన బొజ్జ ఐశ్వర్యనే కాదన్నారు.అరెస్టులతో వెంటుకలు కూడా పీకలేరని, ఈడ్చి తంతే హైదరాబాద్‌లో పడతావ్ జాగ్రత్త అంటూ పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చింది.

బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలి..

దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన వీర మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రికి రాత్రే గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లోనూ జనసేన నాయకులు, వీర మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బొజ్జ ఐశ్వర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story