హరీష్ రావు దళిత బిడ్డల గురించే అడుగుతున్నారు.. మంత్రి అడ్లూరికి ఆర్ఎస్పీ కౌంటర్

by Ajay Maddhiboyina |

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడితే దళిత బిడ్డను హరీష్ రావు అవమానించారని అంటున్నారని, కానీ హరీష్ రావు మాట్లాడుతుందే దళిత బిడ్డల కోసమని అన్నారు. ఒక దళిత బిడ్డ చెప్పుల కంపెనీకి గురుకులాల్లో టెండర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, దాని గురించి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

హరీష్ రావు దళిత బిడ్డల గురించే అడుగుతున్నారు.. మంత్రి అడ్లూరికి ఆర్ఎస్పీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడితే దళిత బిడ్డను హరీష్ రావు అవమానించారని అంటున్నారని, కానీ హరీష్ రావు మాట్లాడుతుందే దళిత బిడ్డల కోసమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక దళిత బిడ్డ చెప్పుల కంపెనీకి గురుకులాల్లో టెండర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, దాని గురించి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. గురుకులాల్లోనే చదువుకున్న మహేశ్ గోగర్ల అనే దళితబిడ్డ టెండర్ కోసం వెళితే అతడివైపు కనీసం చూడలేదని అన్నారు. గన్ పార్క్ వద్దకు వస్తున్న హరీష్ రావు, కేటీఆర్ ను ఎవరు అరెస్ట్ చేశారో తెలియదని అడ్లూరి, పొన్నం ప్రభాకర్ అంటున్నారని ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్తే హరీష్ రావు, కేటీఆర్ అన్ని ఆధారాలతో వస్తారని గన్ పార్క్ దగ్గరికి చర్చ స్థలం మార్చి, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పి వచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ మంత్రులు CLP కార్యాలయం నుండి గన్ పార్క్ వద్దకు ఇంటెలిజెన్స్ పోలీసులతో వచ్చిన మాట నిజం కాదా? అని అడిగారు. తమను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు తనతో కలిసి పని చేసిన వాళ్ళేనని అన్నారు. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ అంటూ ప్రశ్నించారు.

Next Story