- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాకు రీమేక్‌గా అనీల్ రావిపూడి మల్టీస్టారర్.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్
బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనీల్ రావిపూడి ప్రస్తుతం తన మల్టీ స్టారర్ చిత్రం ‘VenkyAnil 5 x NKRAR2’తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనీల్ రావిపూడి ప్రస్తుతం తన మల్టీ స్టారర్ చిత్రం ‘VenkyAnil 5 x NKRAR2’తో బిజీగా ఉన్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్‌గా అలరించనున్నారు. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యి.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి.. ఈ సినిమా ‘గురువాయూర్ అంబలనడయిల్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తుందంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనిని విపిన్ దాస్ దర్శకత్వంలో, పృథ్వీరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ మూవీ 2024లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక సినిమాకు రీమేక్‌గానే ఇప్పుడు అనీల్ ‘VenkyAnil 5 x NKRAR2’ రాబోతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటివరకు ఈ విషయంపై టీమ్ స్పందించకపోగా.. తాజాగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్న హీరోయిన్ కీర్తి సురేష్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘ ‘VenkyAnil 5 x NKRAR2 మూవీ 'గురువాయూర్ అంబలనడయిల్' సినిమాకు రీమేక్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా డిఫరెంట్ కంటెంట్ అండ్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ’ అని రిప్లై ఇచ్చింది.






