కాకులు తిని ఎంజాయ్ చేయండి.. వ్యక్తి వీడియో వైరల్

by Prasad Jukanti |

కాకులను వేటాడి, వాటిని తిని ఎంజాయ్ చేయాలంటూ ఓ వ్యక్తి చేసిన వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాకులు తిని ఎంజాయ్ చేయండి.. వ్యక్తి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలో ఎన్నో విభిన్న మతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు కలిగిన ప్రజలు ఉన్నాయి. ఒక్కొక్కరి సంప్రదాయం ఒక్కొరకంగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాకులను తినాలంటూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ఓ వ్యక్తి కాకులను వేటాడేందుకు వెళ్లాడు. అక్కడ అతడిపై కాకులు వాలడం ఆసక్తిగా మారింది. తాను తన ఫ్రెండ్స్ తో కలిసి వేటకు వచ్చామని ఈ క్రమంలో ఓ చెట్టుకు 5, మరో చెట్టుకు 4 ఇలా మొత్తం 13 కాకిపిల్లలను పట్టుకున్నామని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అందరూ కాకులను తిని ఎంజాయ్ చేయాలని సదరు వ్యక్తి పిలుపు ఇచ్చాడు. వేటాడిన కాకి పిల్లలు అన్ని భుజంపై వాలి ఉండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఊరులోని కాకులు అన్ని మీ మీద ఉంటే ఇంక పిండాలు తినడానికి ఏం ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story