- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్లా బతకాలయ్య..?
మా జీవన ఆధారమైన సాగు భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కుంటే మేము ఎట్లా బతకాలయ్య అని సుర్ధాపూర్ సావర్ ఖేడ గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ఆసిఫాబాద్: మా జీవన ఆధారమైన సాగు భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కుంటే మేము ఎట్లా బతకాలయ్య అని సుర్ధాపూర్ సావర్ ఖేడ గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెరమెరి ఫారెస్ట్ రేంజ్ దేవుడు పల్లి బీట్ లోని సుర్ధాపూర్ గ్రామ శివారులోని 150 హెక్టార్ల భూమిని అటవీ భూమి పేరిట శనివారం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని.. భారీ పోలీసు బందోబస్తుల మధ్య ట్రెంచ్ వేసేందుకు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ.. మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేస్తూ వస్తున్నాం. మరీ అప్పుడు అటవీ భూములని ఫారెస్ట్ వాళ్లకి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.! ఇది కూడా మాకు మనిషికి రెండు మూడు ఎకరాల చొప్పున ఉన్నాయి. గత 20 రోజుల నుంచి పొలానికి వెళ్లనివ్వకుండా పోలీసులు ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. మాకు వేరే ఉపాధి ఎంలేదని..! ఈ భూములే మా ఆధారమని.. వీటిని లాక్కుంటే మాకు చావే శరణ్యమని బాధిత రైతులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించి భూములను తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.






