- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారంతో భోజనం! వీడియో వైరల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజన పథకం పలు జిల్లాల్లో పక్కదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజన పథకం పలు జిల్లాల్లో పక్కదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహారం అందించాల్సిన చోట.. నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు కారంతో అన్నం తింటున్న ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం విద్యార్థుల ప్లేట్లలో కారం మాత్రమే కనిపించగా, కూర వండిన పాత్రలు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్నం మాత్రం మిగిలి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
కూర పూర్తిగా అయిపోవడంతోనే విద్యార్థులకు కారంతో అన్నం తిన్నట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. అయితే, చెన్నూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కారం పొడి పెట్టినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకు సైతం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను విస్తరించింది. మరోవైపు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి కూడా ఈ పథకాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.






