టాప్ దర్శకుడితో చేతులు కలిపిన రెజీనా కసాండ్రా.. లేడీఓరియెంటెడ్ మూవీతో రాబోతున్న అమ్మడు

by Chukka Sudharani |

త్వరలో లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది రెజీనా కసాండ్రా.

టాప్ దర్శకుడితో చేతులు కలిపిన రెజీనా కసాండ్రా.. లేడీఓరియెంటెడ్ మూవీతో రాబోతున్న అమ్మడు
X

దిశ, సినిమా: ‘ఖైదీ, విక్రమ్, కూలీ, లియో’ వంటి చిత్రాలతో దర్శకుడిగా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు హీరోగా కూడా అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ‘డిసి’ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లోకేశ్ కనగరాజ్.. తన తదుపరి ప్రాజెక్టుపై కూడా ఫోకస్ పెట్టినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ సారి డైరెక్టర్‌గా, హీరోగా కాకుండా నిర్మాతగా మరో సినిమాను లైన్‌లో పెట్టాడట ఈయన. ఈమేరకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన చిత్ర నిర్మాణ ప్రయాణాన్ని కొనసాగిస్తు.. ఓ లేడీఓరియెంటెడ్ మూవీకి సిద్ధం అవుతున్నాడని టాక్. ఈ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ కాగా.. మహిళా ప్రధాన చిత్రం కావడంతో రెజీనా కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చెయ్యగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్.

Next Story