ఒక జిల్లాకు మా నాన్న పేరు పెట్టండి: ఆశ కిరణ్

by Vemula.Srinu Prasad |

తన తండ్రి వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కుమార్తె ఆశ కిరణ్ కోరారు. శనివారం రంగా 79వ జయంతి సందర్భంగా విజయవాడలో ఆమె నివాళులర్పించారు...

ఒక జిల్లాకు మా నాన్న పేరు పెట్టండి: ఆశ కిరణ్
X

దిశ, వెబ్ డెస్క్: తన తండ్రి వంగవీటి రంగా(Vangaveeti Ranga) పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన కుమార్తె ఆశ కిరణ్(Asha Kiran) కోరారు. శనివారం రంగా 79వ జయంతి(Ranga 79th Birth Anniversary) సందర్భంగా విజయవాడలో ఆమె నివాళులర్పించారు. రంగా అంత్యక్రియలు కృష్ణానది తీరంలో చేశారని ఆమె గుర్తు చేశారు. కృష్ణా తీరం(Krishna Theeram)లో గంగా స్మారక ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిశీలన చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని ఆమె తెలిపారు. జిల్లాకు పేరు, స్మారక ఘాట్‌పై ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని ఆశ కిరణ్ వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నాయకులకు స్మారక ఘాట్లు ఉన్నాయని, కానీ తన తండ్రి రంగాకు లేదని తెలిపారు. రంగా అంటే తనకు అభిమానమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారని, త్వరలోనే ఆయన్ను కలిసి లెటర్ ఇస్తామని చెప్పారు. తమ వినతిని అంగీకరిస్తారనే నమ్మకం ఉందని ఆశ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story