ఆ 23 మందిని టెర్రరిస్టులుగా ప్రక్కటించిన కేంద్ర ప్రభుత్వం

by Muthe.Rajitha |   (  Updated:2026-07-04 09:15:26  IST  )

దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద శక్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది.

ఆ 23 మందిని టెర్రరిస్టులుగా ప్రక్కటించిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద శక్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు పన్నుతున్న జైషే మహమ్మద్ (JeM), లష్కరే తయ్యిబా (LeT) మరియు వాటి అనుబంధ సంస్థలకు చెందిన 23 మంది కీలక ఆపరేటివ్స్‌ను కేంద్రం 'ఉగ్రవాదులు'గా ప్రకటించింది. ఈ మేరకు కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద వారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 23 మంది ఆపరేటివ్స్ జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

లోయలో భారీ ఉగ్రదాడులకు వ్యూహాలు రచించడం, అంతర్జాతీయ సరిహద్దుల గుండా డ్రోన్లను ఉపయోగించి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం, భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరించడం వంటి దేశద్రోహ చర్యల్లో వీరికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని కేంద్రం పేర్కొంది. దీనితో పాటు, సోషల్ మీడియా వేదికగా స్థానిక యువతను బ్రెయిన్‌వాష్ చేస్తూ టెర్రర్ రిక్రూట్‌మెంట్‌ చేపట్టడం, డిజిటల్ ఛానళ్ల ద్వారా ఉగ్ర నిధులు సమీకరించడంలోనూ వీరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది.

30 మంది పాకిస్థాన్ జవాన్లు మృతి !

Next Story