శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల భవనం.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

by Jakkula.Mamatha |

మండలంలోని దీపాయంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది.

శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల భవనం.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
X

దిశ,దౌల్తాబాద్: మండలంలోని దీపాయంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పాఠశాల గోడలు భారీ పగుళ్లతో బలహీనపడగా, పైకప్పు కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు భయాందోళనల మధ్య విద్యను అభ్యసిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదులలో తడి, పైకప్పు నుంచి నీటి లీకేజీలు ఉండడంతో పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవనం దుస్థితిపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాల కంటే మరేదీ ముఖ్యమేమీ కాదని పేర్కొంటున్న గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు వెంటనే శిథిల భవనాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ భవనాల్లో తరగతులు నిర్వహించడంతో పాటు కొత్త పాఠశాల భవనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తుగా చర్యలు తీసుకుని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story