- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

దిశ, వేములవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సుమారు 20ఎకరాల్లో రూ.200 కోట్లతో 2600 మంది విద్యార్థులకు వసతి, విద్యను అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగుల సత్యనారాయణ, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఆర్డీవో కె.ఎస్.బి కుమారి తదితరులు పాల్గొన్నారు.






