- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైత్రి మూవీ మేకర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ షాక్.. ప్రభాస్ సినిమా షూటింగ్‌పై ఒత్తిడి?
'ఫౌజీ'ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ఒత్తిడి తెస్తోందన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న 'ఫౌజీ' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే, ఈ చిత్రాన్ని కచ్చితంగా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తోందని, ఒకవేళ నిర్ణయించిన సమయానికి సినిమా విడుదల కాకపోతే ముందుగా ఒప్పుకున్న ఒప్పంద మొత్తంలో కొంత మేర కోత విధిస్తామని తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలమే అయింది. అయితే ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా పెద్దగా ఎలాంటి అప్డేట్లు విడుదల కాలేదు. మరోవైపు డిసెంబర్ కూడా దగ్గరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి సినిమాను విడుదల చేయగలరా లేదా అనే అంశం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. ఏదేమైనా, 'ఫౌజీ' చిత్రంపై ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.






