Big Alert: బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్‌పై మోజుతో జిమ్‌కు వెళ్తున్నారా?

by Gantepaka Srikanth |

నగరంలో యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని, తక్కువ సమయంలోనే కండలు పెంచుకోవచ్చనే ఆశచూపి ప్రాణాంతక స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు.

Big Alert: బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్‌పై మోజుతో జిమ్‌కు వెళ్తున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని, తక్కువ సమయంలోనే కండలు పెంచుకోవచ్చనే ఆశచూపి ప్రాణాంతక స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లోని జిమ్‌లను వేదికగా చేసుకుని ఈ నెట్‌వర్క్ సాగుతోంది. బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ బాడీలపై మోజు పెంచుకుంటున్న యువతను టార్గెట్ చేస్తూ.. తక్షణ కండరాల పెరుగుదల (Instant Muscle Growth) కోసం ఈ ముఠా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఎరగా వేస్తోంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేని ప్రమాదకరమైన హార్మోన్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ విచారణలో తేలింది.

స్టెరాయిడ్ల వినియోగం..

నగరంలోని పలు ప్రధాన జిమ్‌లలో ఈ స్టెరాయిడ్ల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి భారీ ఎత్తున స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువత ఇలాంటి షార్ట్‌కట్ పద్ధతుల వైపు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, జిమ్ నిర్వాహకులు ఎవరైనా ఇలాంటి అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి, ఈ సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story