కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Jakkula.Mamatha |

రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీవాణి ప్రకటనలో తెలిపారు.

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, రాజంపేట: రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీవాణి ప్రకటనలో తెలిపారు. మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు, వయసు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై రాజంపేట మండలంలోని మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని వేళలు ఉంటాయని వంట చేయడంలో అనుభవం ఉన్నవాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పదో తరగతి సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రంతో ఈ నెల 6వ తేదీ సోమవారం రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా అభ్యర్థులు కస్తూర్బా బాలికల విద్యాలయం, రాజంపేటలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Next Story