పోలీస్ శాఖలో కీలక పరిణామం.. 9 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం పోలీస్ శాఖలో బదిలీలు, పదోన్నతులను కల్పిస్తోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తోంది...

పోలీస్ శాఖలో కీలక పరిణామం.. 9 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం పోలీస్ శాఖ(Police Department)లో బదిలీలు, పదోన్నతులను కల్పిస్తోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తోంది. ఇందులో భాగాంగా తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 9 మంది డీఎస్పీ(Dsp)లకు కూటమి ప్రభుత్వం అదనపు ఎస్పీ(Aditional SP)లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.వీరందరినీ మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌(Police Headquarters)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందిన డీఎస్పీలు

ఎం.రాజగోపాల్ రెడ్డి, పి. శ్రీకాంత్, టి. శ్రీనివాసులు, జి. శివప్రభాకర్ రెడ్డి, డి.సోమన్న, ఏఎస్. చక్రవర్తి, ఎం. అంబికా ప్రసాద్, ఎస్.వాసుదేవ్, ఏ నరసింహమూర్తి

Next Story