- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమ్మారంలో నాటుసారా స్థావరం పై పోలీసుల దాడి.. కేసు నమోదు
by Batti.Sumithra |
చింతలపాలెం మండలం తమ్మారం గ్రామ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన నాటుసారా తయారీ స్థావరం పై శనివారం పోలీసులు దాడి నిర్వహించారు.

X
దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండలం తమ్మారం గ్రామ సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన నాటుసారా తయారీ స్థావరం పై శనివారం పోలీసులు దాడి నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, చింతలపాలెం పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడిలో 10 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారా తయారీకి ఉపయోగిస్తున్న సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శేషం రామకృష్ణ పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ పరమేష్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నాటు సారా తయారీ, నిల్వ, విక్రయాల పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
Next Story






