- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్కారు కృషి: మంత్రి అడ్లూరి
జైనలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.

దిశ, ధర్మపురి: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ శనివారం ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి ఆదర్శమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు...
అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్య, ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగా పేదల కొరకు పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని అలాగే అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు సన్న ధాన్యం పండించిన వారికీ బోనస్ చెల్లిస్తున్నమని తెలిపారు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని అసమానతులను దూరం చేయడానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






