మిడ్జిల్ నాటిన మొక్క.. నేడు మహా వృక్షమైంది: CM రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు జడ్పీటీసీగా తనను ఆశీర్వదించారని ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇవాళ పెద్ద వృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మిడ్జిల్ నాటిన మొక్క.. నేడు మహా వృక్షమైంది: CM రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు జడ్పీటీసీగా తనను ఆశీర్వదించారని ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇవాళ పెద్ద వృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్ ప్రజలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‍లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. జడ్పీటీసీగా సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు 2006 జులై 4 అని గుర్తుచేశారు. ఆరోజు అది నా గెలుపు కాదని.. అది మిడ్జిల్ ప్రజల గెలుపు అన్నారు. జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మిడ్జిల్ ప్రజలు అక్కున చేర్చుకున్నారని నాది ఈ నియోజకవర్గం కాకపోయినా ఇక్కడి ప్రజలు నమ్మకంతో గెలిపించారన్నారు. ఆనాడు మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. ఉరుములు ఉరిమినా, పిడుగులు పడ్డా నన్ను కలిసేందుకు వచ్చారు. ఉరుములు ఉరిమినా, పిడుగులు పడ్డా నన్ను కలిసేందుకు వచ్చారన్నారు.

మిడ్జిల్‍ను భట్టి దద్దత తీసుకోవాలి..

తనను అక్కున చేర్చుకున్న మిడ్జిల్ మండలం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. అందువల్లే ఈ మండలాన్ని దద్దత తీసుకుని అభివృద్ధి సక్షేమ పనులను సమన్వయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు. ఇది డార్క్ మండలం కాదని ఈ ప్రాంత ప్రజలకు వెలుగు రేఖలు వచ్చాయని ప్రభుత్వ లెక్కల్లో తేలాలని సూచన చేశారు. తన 20 ఏళ్ల ప్రజాజీవితంలో ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదని ప్రతిపక్షంలో ఉంటే ప్రజాసమస్యలపై పోరాటం చేశాను. అధికారంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించానన్నారు. అలాగే దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించానన్నారు. 40 ఏళ్ల వర్గీకరణ అనే రావణకాష్టాన్ని తనకు అవకాశం వచ్చిన వెంటనే పరిష్కారం చూపించానన్నారు. అలాగే 100 ఏళ్ల బీసీ సమస్యకు జనగణనతో పరిష్కారం చూపించానన్నారు.

కేసీఆర్‌కు ఉరేసినా తప్పులేదు..

అనుభవం లేదని నన్ను చాలా మంది అవహేళన చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నన్ను అన్ని కులాలు, మతాలు, అక్కున చేర్చుకున్నాయి. పేదల సమస్యలు చూసుకుంటూ పెరిగాను. వ్యవసాయం తెలుసు. భూమికి, విత్తనానికి ఉన్న బంధం ఏంటో పరిపాలన చేసే వాడికి ఉండాల్సిన అవగానతోనే గ్రామంలో పెరిగానన్నారు. గ్రామీణ సమస్యలు గడీల్లో ఉన్న దొరలకు తెలియకపోవచ్చు. కానీ గ్రామంలోని సమస్యలు పరిష్కారం అయితేనే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్లు ఉన్నారు. పాలమూరు ప్రజలు పరిపాలనకు పనికిరారా? తట్టపనికి, పార, పలుగు పనికి పాలమూరు బిడ్డ కావాలి కానీ పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురంహాంకారాన్ని బొందపెట్టాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందన్నారు. అహంకారానికి కూడా ఓ హద్దు ఉంటుంది. అహంకారం, అహంభావం పెట్రేగిపోయి గద్దరన్నను గడీల ముందు నాలుగు గంటలు ఎర్రటి ఎండలో కుర్చోబెట్టిన వ్యక్తిన మనం క్షమించాలా? గద్దర్‌ను ఎండలో నిలబెట్టినా కేసీఆర్‌ను ఉరిశిక్షణ వేసినా తప్పులేదన్నారు.

‘నా వల్ల ఎవరికీ కష్టం నష్టం రావొద్దనేదే నా ఆలోచన. ఆనాడు నాపై జడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానీకి ఈనాటి ప్రభుత్వంలో ఏదో ఒక మంచి బాధ్యత ఇస్తామన్నారు. ఈ మేరకు బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ నేతలను ఆదేశించారు.

Next Story