- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మధు మోహన్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మధు మోహన్ అన్నారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు,జిల్లా బిసి సంక్షేమ అధికారి అక్బర్ పాషా,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.






