మిర్యాలగూడ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో సాగునీటి సమస్యకు చెక్ !

by Batti.Sumithra |

మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం పరిశీలించారు.

మిర్యాలగూడ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో సాగునీటి సమస్యకు చెక్ !
X

దిశ, దామరచర్ల : మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన పనుల నాణ్యత, నిర్మాణ వేగం, సాంకేతిక అంశాలను సమీక్షించారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దున్నపోతుల గండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ఈ ప్రాంత రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Next Story