కల్వకోల్ శివాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్టలో అపశ్రుతి

by Kodari Anjali |

కల్వకోల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది.

కల్వకోల్ శివాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్టలో అపశ్రుతి
X

దిశ,పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని కల్వకోల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ వాతావరణంలో జరిగింది. అయితే కొద్దిసేపటికి శివాలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం చేపడుతుండగా, రాతి ధ్వజస్తంభం హిటాచీతో పైకి లేపుతుండగా ఆకస్మాత్తుగా మధ్యలో విరిగిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధు మిత్రులు, భక్తులు ఈ హఠాత్ పరిణమానికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే విరిగిపోయిన ధ్వజ స్తంభాన్ని తొలగించారు. అనంతరం గ్రామం బయట ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర కూడా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంతో పాటు బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ కాటమ్ జములయ్య, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ రాము యాదవ్, మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ కురుమయ్య, మాజీ సర్పంచ్ పెబ్బేటి విజయుడు, సీపీఐ జిల్లా నాయకులు కోళ్ల యేసయ్య, కాంగ్రెస్ నాయకులు మధు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బెట్టరీ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story