- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసా స్పీడప్.. ఆరో ఎకరా రైతులకూ నిధులు విడుదల
రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం మరో అద్భుతమైన శుభవార్త అందించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం మరో అద్భుతమైన శుభవార్త అందించింది. వానాకాలం సాగు పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో, ఐదో విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆరు ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేసింది. శనివారం ఒక్కరోజే దాదాపు 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7135 కోట్లను ప్రభుత్వం జమ చేయడం విశేషం.
కాగా, ఈ ఏడాది జూన్ 30 నుంచి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా విడతల వారీగా ఈ నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తోంది. నిధుల విడుదలలో భాగంగా.. తొలి రోజు రెండు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. ఆ తర్వాత వరుసగా మూడు ఎకరాలు, నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు నిధులు వేయగా.. నిన్న (శుక్రవారం) ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయాన్ని అందించారు. తాజాగా శనివారం నాడు ఐదో విడత కింద ఆరు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కూడా నిధులు విడుదల కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






