బీజేపీ నాయకుల గృహ నిర్బంధం..

by Kodari Anjali |

బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి జన్మదినం రోజున కూడా కనీసం భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని బీజేపీ పార్టీ ఖండించించి.

బీజేపీ నాయకుల గృహ నిర్బంధం..
X

దిశ, హన్మకొండ టౌన్: బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి జన్మదినం రోజున కూడా కనీసం భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దారుణమని బీజేపీ పార్టీ ఖండించించి. రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో ఆలయాలను అపవిత్రం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తనిఖీలను, అడ్డంకులను ఎదుర్కొని అయినా సరే తప్పకుండా భద్రకాళి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తామని రావు పద్మ రెడ్డి స్పష్టం చేస్తూ ఆలయానికి బయలుదేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ధ్వజమెత్తింది. కూడా చైర్మన్ వెంకట్రాం రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మర్రి యాదవ రెడ్డి ఇద్దరూ కలిసి దొంగ ప్రమాణాలతో, తడి బట్టలతో పవిత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆలయ పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని గౌరవించాలని భావించి భద్రకాళి దేవాలయం వద్ద పసుపు నీటితో శుద్ధి కార్యక్రమం వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆలయ శుద్ధి కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుని హౌస్ అరెస్ట్ చేయడం దురదృష్టకరమంటూ బీజేపీ శ్రేణులు ఖండించాయి.

Next Story