- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిభకు ప్రోత్సాహం... విజేతలకు పురస్కారం
అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంబరాలు (కో-ఆపరేటివ్ సెలబ్రేషన్స్) కార్యక్రమాలు మండల కేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

దిశ, దుమ్ముగూడెం : అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సంబరాలు (కో-ఆపరేటివ్ సెలబ్రేషన్స్) కార్యక్రమాలు మండల కేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సంఘం చైర్మన్ కిలిమి ఎల్లారెడ్డి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో సహకార భావన, సామాజిక బాధ్యత, పోటీతత్వాన్ని పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ యలమంచి శ్రీనుబాబు, సొసైటీ సీఈఓ తాళ్లపూడి హిమబిందు, సిబ్బంది గంగరాజు, సురేష్, వంశీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాస్త్రి, ఉపాధ్యాయులు మైకేల్, ప్రసన్న, సరస్వతి, చైతన్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






